ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం.. CM కేసీఆర్ ను కలుసుకున్నారు. ఫ్యామిలీతో కలిసి ప్రగతి భవన్ కు వెళ్లిన బ్రహ్మానందం.. మ్యారేజ్ వెడ్డింగ్ కార్డును అందజేశారు. తన రెండో కుమారుడు సిద్ధార్థ్ వివాహానికి రావాలని కేసీఆర్ కుటుంబాన్ని ఆహ్వానించారు. తన సతీమణితోపాటు పెద్ద కుమారుడు గౌతమ్ తో కలిసి బ్రహ్మానందం CMను కలుసుకున్నారు. పెళ్లికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. అనంతరం CMకు శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందజేశారు.
CM కేసీఆర్ కు అందించిన శ్రీవేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని బ్రహ్మానందం స్వయంగా గీయడం విశేషం.
Super