పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ మూవీ జులై 28న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్, ట్రైలర్.. సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టనుంది మూవీ టీమ్. అయితే ఇప్పుడు ‘బ్రో’ మూవీ రన్ టైమ్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు 130 నిమిషాల క్రిస్పీ రన్‌టైమ్ లాక్ చేయబడిందని సమాచారం.
సాధారణంగా పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలకు 2.10 గంటల రన్‌టైమ్ అనేది అరుదు. అయితే ఇందులో ఆయన రోల్ కొద్దిసేపే ఉండనుంది. సినిమా మొదలైన 20 నిమిషాల తర్వాత ఆయన ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. ఆ తర్వాత సినిమా మొత్తం అక్కడక్కడా కనిపించే అవకాశం ఉంది. కాగా.. ఇది ప్రధానంగా సాయిధరమ్ తేజ్ మూవీ. కాబట్టి అతని క్యారెక్టర్ చుట్టే కథ తిరగనుంది. తను మార్కండేయ అనే పాత్రలో కనిపించనున్నారు.
ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది. అలాగే ప్రియా ప్రకాష్ వారియర్, కేతికా శర్మ ఫిమేల్ లీడ్స్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ‘బ్రో’ మూవీకి సముద్రఖని దర్శకుడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. తమిళ్లో విజయం సాధించిన ‘వినోదయ సిత్తం’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా ‘బ్రో’ మూవీ తెరకెక్కింది. ఇక తమిళ్లో ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది కూడా సముద్రఖనే కావడం విశేషం.