
‘బిజినెస్ మేన్’.. అందులోని డైలాగ్ లు ఎప్పుడూ సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంటాయి. అంతటి బ్రహ్మాండమైన హిట్ సాధించిన ఈ మూవీ ఇప్పుడు మరోసారి ఆడియన్స్ ను అలరించేందుకు రెడీ అవుతోంది. మరో వారం రోజుల్లో ఇది ఇంకోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన స్టామినా ఏంటో మరోసారి రుజువైంది. ఆయన నటించిన ‘బిజినెస్ మేన్’ రీ రిలీజ్ కు విశేష స్పందన వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో(Abroad)లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తేనే ఆయనకున్న ఇమేజ్ అర్థమవుతుంది.
పదకొండేళ్ల క్రితం 2012లో వచ్చిన ‘బిజినెస్ మేన్’ ఎంతటి బిగ్ హిటో అందరికీ తెలిసిందే. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ… అప్పట్లోనే రూ.100 కోట్ల దాకా కలెక్షన్లు రాబట్టింది. మహేశ్ బర్త్ డే సందర్భంగా ఈనెల 9న ‘బిజినెస్ మేన్’ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ మహా నగరాలతోపాటు అమెరికా, ఇంగ్లండ్ వంటి దేశాల్లోనూ ఈ మూవీకి మంచి క్రేజ్ కనిపిస్తున్నది. కాజల్ హీరోయిన్ కాగా.. ప్రకాశ్ రాజ్ మెయిన్ రోల్ పోషించారు.