హిట్టు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ఫస్ట్ ‘పాన్ ఇండియన్ హీరో’గా పిలుచుకునే ప్రభాస్. ప్రొడ్యూసర్లు డేట్స్ ఇచ్చిన తీరు చూస్తే మరో మూడేళ్ల వరకు ప్రభాస్ ఖాళీగా ఉండే పరిస్థితి లేదట. కొత్తగా డేట్స్ ఇద్దామంటే డైరీ ఖాళీ లేనంతగా.. ఇంకో దర్శక, నిర్మాతకు ఛాన్స్ ఇవ్వనంతగా కంటిన్యూ మూవీస్ కు కమిట్ అయ్యారట. ‘కల్కి’తోపాటు డైరెక్టర్ మారుతితో ‘రెబెల్ స్టార్’ సినిమాలు సెట్స్ పై ఉండగా.. ‘సలార్’ రెండు పార్ట్స్ గా రాబోతోంది. పాన్ ఇండియా స్టార్ ను కాబట్టి తనకు భాషల మధ్య హద్దుల్లేవన్నట్లుగా కేవలం తెలుగు వారితోనే కాకుండా అన్ని లాంగ్వేజెస్ దర్శకులు, మ్యుజిక్ డైరెక్టర్లతో పనిచేస్తున్నారు. ఇప్పటికే ‘ఆదిపురుష్’ మూవీ మిక్స్ డ్ ఒపీనియన్ ను మూటగట్టుకోగా.. ఈ మధ్యకాలంలో వచ్చిన ‘రెబల్ స్టార్’ సినిమాలు ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ‘బాహుబలి’ తర్వాత అంతకన్నా మించి బడ్జెట్ తో వచ్చిన ‘సాహో’ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
ఈ మధ్యే అమెరికా నుంచి సొంతగడ్డపై కాలుపెట్టిన ఈ ‘పాన్ ఇండియా స్టార్’ మరో మూడేళ్ల పాటు ఖాళీ లేకుండా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ‘బాహుబలి’ అంతలా కాకున్నా మునుపటి ప్రభాస్ ను చూడాలని ఆశిస్తున్న ఫ్యాన్స్ కు మాత్రం నిరాశే ఎదురవుతోంది. యాక్టింగ్, మ్యూజిక్ పరంగా ఈ నటుణ్ని చూసి చాలా కాలమైందని, ‘ఆదిపురుష్’ యాక్టింగ్ పరంగా ఆకట్టుకున్నా.. మ్యూజిక్, గ్రాఫిక్స్ దెబ్బతీశాయన్న ఒపీనియన్ అభిమానుల్లో ఉంది. ఇలా వరుస మూవీలతో తమ స్టార్ బిజీగా ఉంటున్నా మళ్లీ పాత సినిమాల తరహాలో కొత్త ప్రభాస్ ను చూడాలని తహతహలాడుతున్నట్లే కనపడుతోందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.