బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ల కేసులో మరికొందరు సినీ ప్రముఖులపై కేసులు నమోదయ్యాయి. ప్రకాశ్ రాజ్, దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీ, ప్రణీత, నీతూ అగర్వాల్ పై కేసులు ఫైల్ చేశారు. మొత్తం 25 మందిని మియాపూర్ పోలీసులు.. FIRలో చేర్చారు. బెట్టింగ్ యాప్ ల ప్రచారంతో ఎంతోమంది మోసపోయి ప్రాణాలు కోల్పోయారన్నది ఆరోపణ. ఇప్పటికే యూట్యూబర్లు, ఇన్ ఫ్లూయెన్సర్లయిన 11 మందిపై కేసులు నమోదు కాగా, విచారణ కోసం వారందరికీ నోటీసులు పంపించారు.
వీరిపైనే…
ప్రకాశ్ రాజ్, దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీ, ప్రణీత, నీతూ అగర్వాల్, శ్యామల, అననన్య నాగళ్ల, శ్రీముఖి, రీతూ చౌదరి, విష్ణుప్రియ, వర్షిణి, బండారు సుప్రీత, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభాశెట్టి, అమృత చౌదరి, నాయని పావని, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, నేహా పఠాన్, హర్షసాయి, సన్నీ యాదవ్, టేస్టీ తేజ