ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత కథ ఆధారంగా తీసిన ‘ఛావా’ సినిమా.. సరికొత్త రికార్డు సృష్టించింది. ఫిబ్రవరి 14న రిలీజైన ఈ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా రూ.750 కోట్లు రాబట్టింది. ఐదో వీకెండ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో టాప్-1లో నిలిచింది. ‘ఛావా’ రూ.22 కోట్లు రాబట్టగా, ‘స్త్రీ’ రూ.16 కోట్లు, ‘పుష్ప-2’ రూ.14 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. విక్కీ కౌశల్, రష్మిక మంధన నటించిన ‘ఛావా’.. మౌత్ టాక్ తోనే భారీస్థాయిలో కలెక్షన్లు రాబడుతోంది. పాన్ ఇండియా సినిమాల్లో లో ‘పుష్ప-2’ రికార్డు సృష్టిస్తే దాన్ని ‘స్త్రీ’ అధిగమించింది. కానీ ఆ రెండింటి రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తూ ‘ఛావా’ సంచలన రీతిలో ఆడుతోంది.