వేతనాలు పెంచాలంటూ కొన్ని రోజులుగా సమ్మెకు దిగిన సినీ కార్మికులతో చర్చలు ఫలించాయి. ఫిలిం ఇండస్ట్రీ(Film Industry) వర్కర్స్ ఫెడరేషన్ కు చెందిన 24 కార్మిక సంఘాలు.. షూటింగ్ లు నిలిపేసి బంద్ కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే సంఘాల నాయకులతో చిరంజీవి సమావేశమయ్యారు. చివరకు ఇది కార్మిక శాఖకు చేరడంతో.. నిర్మాతలు, నాయకులు అక్కడే చర్చలు జరిపారు. ఇరువర్గాల సయోధ్యతో మూడేళ్ల కాలానికి 22.5% పెంపునకు అంగీకారం కుదిరింది. ఈ నిర్ణయంతో 18 రోజులుగా నిలిచిపోయిన షూటింగ్ లు మళ్లీ షురూ కాబోతున్నాయి.