కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ అప్‌కమింగ్ మూవీ ‘లియో’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. అయితే (జూన్ 22) విజయ్ బర్త్‌డే సందర్భంగా ‘లియో’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీనికి విజయ్ ఫ్యాన్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ లభిస్తోంది. ఇదే క్రమంలో ‘లియో’ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్రకటించారు మేకర్స్. లియో చిత్రాన్ని ప్రధాన భారతీయ భాషల్లోనే కాకుండా పలు ఫారిన్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
స్మైలింగ్ బ్యూటీ త్రిష కృష్ణన్ ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా నటిస్తోంది. అయితే, లియో చిత్రాన్ని విదేశీ భాషల్లోనూ విడుదల చేయనున్నట్లు నిర్మాత లలిత్ కుమార్ ట్విట్టర్లో వెల్లడించారు. ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్.. జర్మన్ తదితర ఫారిన్ లాంగ్వేజెస్‌లో ఓటీటీ ప్లాట్ ప్లాట్ఫామ్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ లెక్కన ‘లియో’ ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేయనుంది.
ఇక లియో మూవీ విషయానికొస్తే.. విజయ్, త్రిష జంటగా నటిస్తున్న చిత్రంలో సంజయ్ దత్, అర్జున్, ప్రియా ఆనంద్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్ తదితరులు నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోపై లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత విజయ్.. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నెక్ట్స్ సినిమా చేయనున్నారని తెలుస్తోంది.