పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌లో మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ ‘ప్రాజెక్ట్ కె’. వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకుడు. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్, కమల్ హాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ నటిస్తుండటంతో భారీ అంచనాలున్నాయి. ఈ మేరకు జులై 20న శాన్ డియాగో కామిక్ కాన్ (SDCC) వేదికగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇదే క్రమంలో తాజాగా దీపికా పదుకొణె ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు.
‘భవిష్యత్‌లో వెలుగులు నింపే ఆశా కిరణం.. ఇదిగో.. ప్రాజెక్ట్ నుంచి దీపికా పదుకొణె’ అంటూ తన పిక్ షేర్ చేశారు. అంతేకాదు జులై 20న యూఎస్ఏలో, జులై 21న ఇండియాలో ‘ప్రాజెక్ట్ కె’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇదే రోజున ప్రాజెక్ట్ కె అంటే ఏమిటో వెల్లడించనున్నారు మేకర్స్. ఇక కథ విషయానికొస్తే.. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఇందులో ప్రభాస్.. విష్ణుమూర్తి చివరి అవతారమైన ‘కల్కి’ పాత్రలో కనిపిస్తారని టాక్ నడుస్తోంది.