గతేడాది చివరన ‘ధమాకా’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌కు దర్శకత్వం వహించిన త్రినాథరావు నక్కిన… ఇప్పటి వరకు మరో ప్రాజెక్ట్ సెట్ చేసుకోలేదు. పలువురు స్టార్ హీరోలకు కథలు వినిపించినా.. ఏ ఒక్కటీ మెటీరియలైజ్ కాలేదు. ఓ దశలో మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఉంటుందని కూడా వార్తలు వినిపించాయి. కానీ అవేవీ ఫలించలేదు. దీంతో మరోసారి మాస్ మహరాజ్నే నమ్ముకున్నారు త్రినాథరావు.
రవితేజ, శ్రీలీల జంటగా ఆయన తెరకెక్కించిన ‘ధమాకా’ గతేడాది డిసెంబర్లో విడుదలవగా.. మాస్ మహరాజ్‌ను మొదటిసారి వంద కోట్ల క్లబ్లో చేర్చింది. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు.. రవితేజ మరోసారి త్రినాథరావుకు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనుండగా.. ఇప్పటికే భారీ అడ్వాన్స్‌తో ఈ దర్శకుడిని లాక్ చేశారని టాక్. అంతేకాదు త్రినాథరావు చెప్పిన ఐడియాకు రవితేజ ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీంతో స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారట త్రినాథరావు.
ఇదిలా ఉంటే.. రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు ‘టైగర్ నాగేశ్వరరావు, ఈగ’ చిత్రాల షూటింగ్ జరుగుతోంది. మరోవైపు గోపీచంద్ మలినేనితో ఒక సినిమా చేసేందుకు కమిట్ అయ్యారు. కాగా.. ఈ రెండు ప్రాజెక్టులు కూడా ఈ ఏడాది చివరి నాటికి సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాదు సందీప్ రాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సైతం రవితేజ సిద్ధమైనట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.