ధనుష్ కథానాయకుడి(Hero)గా నటిస్తూ సొంతంగా దర్శకత్వం చేసిన సినిమా ‘రాయన్(Raayan)’. ఇది ఆయనకు 50వ మూవీ కాగా.. మరో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. ధనుష్ మెకానిక్ పాత్రలో నటిస్తున్న ‘రాయన్’ టీజర్, ట్రెయిలర్ సహా పాటలను ఇప్పటికే విడుదల చేశారు.
ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను సైతం నిన్న నిర్వహించగా.. నిర్మాతలు సురేశ్ బాబు, దిల్ రాజు అతిథులుగా అటెండయ్యారు. జాతీయ నటి అపర్ణా బాలమురళి, ఎస్.జె.సూర్య, ప్రకాశ్ రాజ్, సెల్వ రాఘవన్ కీలక పాత్రల్లో నటించగా.. A.R.రహ్మాన్ సంగీత దర్శకుడు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.