
తెలుగు చలన చిత్ర వాణిజ్యం మండలి(TFCC) ఓట్ల లెక్కింపు ముగిసింది. సాయంత్రం నుంచి రాత్రి వరకు కొనసాగిన కౌంటింగ్ లో నిర్మాత దిల్ రాజు విజయం సాధించారు. సి.కల్యాణ్ పై విజయం సాధించిన దిల్ రాజు.. 31 ఓట్లతో గెలుపును సొంత చేసుకున్నారు. వైస్ ప్రెసిడెంట్ గా ముత్యాల రామరాజు, సెక్రటరీగా దామోదర ప్రసాద్, క్యాషియర్ గా ప్రసన్నకుమార్ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎలక్షన్లలో 1,339 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్టూడియోల ఓనర్లు, ప్రొడ్యూసర్లు ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు.
రెండేళ్లకోసారి జరిగే ఈ ఎలక్షన్లను ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించారు. ఫిలిం ఛాంబర్ ఆఫీసులో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం మూడింటి వరకు జరిగిన పోలింగ్ ను EVMల ద్వారా నిర్వహించారు.