రెండు రాష్ట్రాల్లో తలెత్తిన వరద విపత్తుకు చలించిన సినీ ప్రముఖులు తమ వంతు సాయాన్ని ప్రకటించారు. జూనియర్ NTR, బాలకృష్ణ, మహేశ్ బాబు, త్రివిక్రమ్ సహా పలువురు సాయం అందజేస్తున్నారు.
జూనియర్ NTR…..: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెరో రూ.50 లక్షల చొప్పున కోటి రూపాయలు
బాలకృష్ణ……: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెరో రూ.50 లక్షల చొప్పున కోటి రూపాయలు
మహేశ్ బాబు…….: రూ.50 లక్షల చొప్పున రెండింటికి కోటి రూపాయలు
త్రివిక్రమ్, రాధాకృష్ణ, నాగవంశీ…: రెండు రాష్ట్రాలకు రూ.25 లక్షల చొప్పున మొత్తం రూ.50 లక్షలు
సిద్ధూ జొన్నలగడ్డ…: రూ.15 లక్షల చొప్పున మొత్తం 30 లక్షలు
విశ్వక్ సేన్…….: రూ.5 లక్షల చొప్పున రెండింటికి రూ.10 లక్షలు
వెంకీ అట్లూరి….: రూ.5 లక్షల చొప్పున తెలుగు రాష్ట్రాలకు మొత్తం 10 లక్షలు
అనన్య నాగళ్ల…….: చెరో రూ.2.5 లక్షల చొప్పున మొత్తం రూ.5 లక్షలు