డ్రగ్స్ సప్లయ్ లో కీలక పాత్ర పోషిస్తున్న ఎనిమిది మందిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ముగ్గురు నైజీరియన్ లు ఉండగా… మిగతా ఐదుగురు మత్తు పదార్థాలు వాడే కస్టమర్లు. సినీ నిర్మాత పట్టుబడ్డ కేసులో వీరంతా నిందితులుగా ఉన్నారు. ఆగస్టు 31న హైదరాబాద్ మాదాపూర్ లోని అపార్ట్ మెంట్ పై నార్కోటిక్ డిపార్ట్ మెంట్ పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో సినీ ఫైనాన్షియర్ వెంకట్ రత్నారెడ్డి తోపాటు బాలాజీ, మురళి అనే వ్యక్తుల్ని అరెస్టు చేశారు. ఈ ముగ్గురిని పూర్తిస్థాయిలో విచారిస్తే మొత్తం 18 మంది ముఠా గుట్టు బయటపెట్టారు. నైజీరియన్ల నుంచి వివిధ రకాల మత్తు పదార్థాల్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ వాడుతూ దొరికిపోయిన ఐదుగురిలో సినీ ప్రొడ్యూసర్ ఉండగా.. ఆ వివరాలు వెల్లడించాల్సి ఉంది. 50 గ్రాముల MDMA, 8 గ్రాముల కొకైన్, 24 ఎక్టసీ పిల్స్ వంటివి పోలీసులు రికవరీ చేసుకున్నారు. సినీ ఫైనాన్షియర్ వెంకట్ రత్నారెడ్డి స్వయంగా డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నట్లు గుర్తించి ఆయన వాట్సాప్ ఛాటింగ్ ను పరిశీలించడంతో ఈ ముఠా గుట్టు వెలుగుచూసింది.
ఈ వివరాల్ని పోలీసులు వెల్లడించబోతున్నారు. ఇందుకు సంబంధించి హైదరాబాద్ CP సీవీ ఆనంద్.. ఈ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. గత 15 రోజులుగా విస్తృతంగా గాలింపు జరుపుతున్న పోలీసులు.. ఎట్టకేలకు నైజీరియన్లను పట్టుకున్నారు.