
Published 23 Nov 2023
విలక్షణ హావభావాలతో అందరినీ ఆకట్టుకునే సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్.. ఇప్పుడు దర్యాప్తు సంస్థల(Investigation Departments) చేతుల్లో చిక్కుకున్నారు. ఆయనకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ED) నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో ప్రకాశ్ రాజ్ కు నోటీసులు జారీ అయ్యాయి. ఒక స్కీమ్(Scheme)కు సంబంధించి మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. దీన్ని సీరియస్ గా తీసుకున్న ED అధికారులు.. ఈ సీనియర్ నటుడికి నోటీసులు పంపించారు. దక్షిణాదితోపాటు వివిధ భాషల్లో నటించి, మెప్పించిన ప్రకాశ్ రాజ్.. గత కొన్ని నెలలుగా వివాదస్పద రీతిలో వ్యవహరిస్తున్నారు. కేంద్రంలోని BJP ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాను వేదికగా చేసుకుని పోస్టులు పెడుతూ సంచలనంగా తయారయ్యారు.
చంద్రయాన్-3 ప్రయోగంపై హేళన
చంద్రయాన్-3 ప్రయోగం సమయంలోనూ ఆయన వివాదాస్పద రీతిలో ప్రవర్తించినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఇస్రో మాజీ ఛైర్మన్ కె.శివన్ ఛాయ్ పోస్తున్నట్లు వ్యంగ్యంగా చూపిస్తున్న కార్టూన్ ను పోస్టు చేసి తీవ్రస్థాయిలో విమర్శలు మూటగట్టుకున్నారు. కొంతకాలం క్రితం KCR సమక్షంలో భారత్ రాష్ట్ర సమితిలో చేరిన ప్రకాశ్ రాజ్.. పార్టీ వ్యవహారాలు, రాజకీయాల పరంగా స్తబ్ధుగా ఉంటున్నారు. సినిమాలు, బయటి ప్రపంచానికి దూరంగా ఉంటూ వస్తున్న ఈయన కేవలం సోషల్ మీడియా వేదికగానే జనాలకు కనిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు ED నోటీసులు జారీ చేయడం ఆసక్తిని కలిగిస్తుంది.