సినీ నటులు దగ్గుబాటి రానా, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండకు.. ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ED నోటీసులు పంపించింది. బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రావాలంటూ నోటీసుల్లో తెలిపింది. ఈ నెల 23న రానా, 30న ప్రకాశ్ రాజ్, ఆగస్టు 6న విజయ్ విచారణ రావాలని స్పష్టం చేసింది. వాటిని ప్రమోట్ చేస్తూ యువతను ప్రలోభాలకు గురిచేశారంటూ హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. మొత్తం 29 మందిపై కేసులు వేయగా, ఇప్పటికే తెలంగాణ CID దర్యాప్తు చేస్తోంది. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. నగదు అంతా విదేశీ శక్తుల చేతుల్లోకి వెళ్లినట్లు ED గుర్తించింది.