చిన్న కుమారుడు మంచు మనోజ్ తో జరిగిన గొడవలో మోహన్ బాబుపై నమోదైన కేసులో తీవ్రత గల సెక్షన్(Section)ను పోలీసులు జత చేశారు. మీడియాపై ఆయన దురుసుగా ప్రవర్తించి మైకు లాక్కొని దాడికి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు మీడియా ప్రతినిధులు తీవ్రంగా గాయపడటంతో ఈ అంశం వివాదాస్పదమైంది. దీనిపై వివిధ మీడియా సంస్థలు, జర్నలిస్టు సంఘాలు పెద్దయెత్తున ఆందోళనకు దిగి మోహన్ బాబును అరెస్టు చేయాలని డిమాడ్ చేశాయి. మొదట ఈ సీనియర్ నటుడి(Actor)పై BNS 118(1) సెక్షన్ ఫైల్ చేసిన పహాడీషరీఫ్ పోలీసులు.. తర్వాత దానికి 109 సెక్షన్ ను కలిపారు. న్యాయసలహా మేరకు సెక్షన్లో మార్పు చేయడం ద్వారా ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైనట్లయింది.