
యాక్షన్(Action), థ్రిల్లర్(Thriller) కథాంశంతో వస్తున్న ‘గేమ్ ఆఫ్ గ్యాంగ్ స్టర్స్-పార్ట్ 1 రూల్ బుక్’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. పోస్టర్, గ్లింప్స్ ను రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ఆడిటోరియంలో ఘనంగా విడుదల చేశారు. తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ వీటిని విడుదల చేశారు. హీరో చంద్రశేఖర్ రాథోడ్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ మంచి విజయం సాధించగలదని ‘బలగం ఫిల్మ్ ఫేమ్’ నిర్మాత మైమ్ మధు అన్నారు. యాక్షన్ మూవీని తక్కువ ఖర్చుతో తీయడం అందరికీ సాధ్యం కాదని చంద్రశేఖర్ రాథోడ్ ను అభినందించారు. కథానాయిక కాశ్వీ కంచన్, ఇతర టెక్నీషియన్స్ కి అభినందనలు తెలియజేశారు. అభినవ్, అథీర రవితో ఇతర నటీనటులతోపాటు అసోసియేట్ డైరెక్టర్ విజయసారథి, అశోక్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పదేళ్లుగా కళాకారులకు శిక్షణ
తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గత దశాబ్ద(Decade) కాలంగా రవీంద్ర భారతిలో ఎంతోమంది కళాకారులకు శిక్షణ(Training) ఇస్తున్నామని ఆ శాఖ డైరెక్టర్ హరికృష్ణ గుర్తు చేశారు. గత కొన్నేళ్లుగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో చిత్రాలు విడుదలై విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. ‘గేమ్ ఆఫ్ గ్యాంగ్ స్టర్స్-పార్ట్ 1 రూల్ బుక్’ దర్శకుడు చంద్రశేఖర్ సైతం రవీంద్ర భారతి యాక్టింగ్ కోర్స్ విద్యార్థి కావడం అభినందనీయమన్నారు.