మరిన్ని వార్తలు, లేటెస్ట్ అప్ డేట్స్ కోసం justpostnews.com ఫాలో కాగలరు.
Published 09 Jan 2024
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్‌స్టార్ మహేష్ బాబు సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. సూపర్ హిట్ పెయిర్ గా ముద్రపడ్డ ఈ జోడీ.. మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైంది. బాహుబలి కన్నా ముందు ఈ ఇద్దరు సృష్టించిన కలెక్షన్ల సునామీ అంతా ఇంతా కాదు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించిన ‘గుంటూరు కారం’ సినిమా విడుదలకు రెడీ అయింది. ఈ నెల 12న అర్థరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షోలు వేసుకునేందుకు నిర్మాణ సంస్థకు అనుమతిచ్చిన ప్రభుత్వం.. టికెట్ల రేట్లు పెంచుకునేందుకు సైతం గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది. 23 చోట్ల బెనిఫిట్ షోలు వేసుకునేందుకు పర్మిషన్ దక్కింది. సింగిల్ స్క్రీన్లలో రూ.65, మల్టీప్లెక్స్ ల్లో రూ.100 చొప్పున పెంచుకునేందుకు సర్కారు సై అంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఫిమేల్ లీడ్స్‌లో నటించిన ఈ మూవీపై మహేశ్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. మొన్నటి ప్రభాస్ ‘సలార్’ సినిమాకు సైతం ప్రభుత్వం… ఇదే రీతిలో బెనిఫిట్ షోలకు అనుమతిచ్చింది.
హ్యాట్రిక్ మూవీ… హ్యాట్రిక్ హిట్స్…
‘గుంటూరు కారం’ మూవీ త్రివిక్రమ్ స్టైల్లో కామిక్ టచ్, ఇంటెన్సిటీని కలిగి ఉంటుందని టాక్. త్రివిక్రమ్, మహేశ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ.. భారీ బడ్జెట్ తో షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రానికి మహేశ్ బాబు భారీ మొత్తం రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇంచుమించు రూ.80 కోట్ల దాకా అందుకున్నట్లు టాక్. సింగిల్ లాంగ్వేజ్ సినిమాల్లో ఇంత పెద్దమొత్తం పారితోషికం తీసుకున్న నటుడిగా మహేశ్ బాబు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ ఇద్దరికీ ఇది హ్యాట్రిక్ మూవీ కాగా.. ఇది హిట్టయితే ఈ ఇద్దరికీ వ్యక్తిగతంగానూ హ్యాట్రిక్ హిట్ గా మిగిలిపోతుంది.
‘సలార్’కన్నా మిన్నగా…
ప్రభాస్ ‘సలార్’ సినిమా రీసెంట్ గా విడుదలై బ్లాక్ బస్టర్ గా సృష్టిస్తున్న ప్రభంజనం గురించి చెప్పాల్సిందేముంది. వరల్డ్ వైడ్ గా హ్యూజ్ కలెక్షన్లు వసూలు చేస్తూ సిల్వర్ స్క్రీన్ ను ఊపేస్తున్న ‘సలార్’ను మించి కలెక్షన్లు రాబట్టాలని ‘గుంటూరు కారం’ చిత్ర యూనిట్ ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే ‘సలార్’ థియేటర్లలో సందడి చేస్తుండటంతో మహేశ్ మూవీకి హాళ్లు అనుకున్న రీతిలో దొరుకుతాయా అన్న సందేహం ఏర్పడింది. అయితే సంక్రాంతి పండుగకు వస్తున్న మరో పెద్ద మూవీ కావడంతో మహేశ్ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ముఖ్యంగా సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లో.. అందునా ఆంధ్రప్రదేశ్ లో సినిమాలకు విపరీతమైన ఆదరణ దక్కే టైమ్ లోనే ఇది రిలీజ్ అవుతుండటం అంచనాలు పెరిగేందుకు కారణమైంది.