
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణంలో మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మరో చిత్రం ‘గుంటూరు కారం’. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ.. భారీ బడ్జెట్ తో షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది జనవరి 13న మూవీని రిలీజ్ చేయనున్నట్లు ప్రొడక్షన్ యూనిట్ తెలిపింది.
శ్రీలీల, మీనాక్షి చౌదరి ఫిమేల్ లీడ్ లో నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్. మొత్తానికి గుంటూరు కారం మూవీ త్రివిక్రమ్ స్టైల్లో కామిక్ టచ్, ఇంటెన్సిటీని కలిగి ఉంటుందని టాక్.
ఈ మూవీకి మహేశ్ బాబు భారీ మొత్తం రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంచుమించు రూ.80 కోట్ల దాకా అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సింగిల్ లాంగ్వేజ్ సినిమాల్లో ఇంత పెద్దమొత్తం పారితోషికం తీసుకున్న నటుడిగా మహేశ్ బాబు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్.. మూవీపై అంచనాలు విపరీతంగా పెంచేసింది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా రిలీజ్ డేట్ ను ప్రకటించడంతో మహేశ్ ఫ్యాన్స్ లో ఉత్సాహం కనిపిస్తోంది.