తెలుగు ఇండస్ట్రీలో ‘తకిట తకిట, ప్రేమ ఇష్క్ కాదల్’ చిత్రాలతో గుర్తింపు పొందిన నటుడు హర్షవర్ధన్ రాణే. ప్రారంభంలో పలు సినిమాల్లో లీడ్ రోల్స్ చేసిన తను.. ఇప్పుడు సెకండ్ హీరో లేదా స్పెషల్ అప్పియరెన్స్కే పరిమితం అవుతున్నాడు. ఇక బాలీవుడ్‌లోనూ కొన్ని మూవీస్ చేసిన ఈ యాక్టర్.. మొత్తానికైతే బండి లాగిస్తున్నాడు. అయితే ఈ మధ్య సంజీదా షేక్‌తో లవ్ ఎఫైర్ గురించి వార్తల్లో నిలుస్తున్నాడు. గత నెల వీరిద్దరూ తమ వెకేషన్‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేసినప్పటి నుంచి వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై రూమర్స్ వెలువడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఇద్దరిలో ఎవరు కూడా తమ డేటింగ్ రూమర్స్‌ను అధికారికంగా ధృవీకరించలేదు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ మూవీలోనూ చిన్న పాత్ర పోషించిన హర్షవర్ధన్‌కు సంజీదా మూడో గర్ల్‌ఫ్రెండ్ అని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. గతంలో తను కిమ్ శర్మ, మీనాక్షి దాస్లతో డేటింగ్ చేశాడు. మరోవైపు సంజీదా సైతం నటుడు అమీర్ అలీని వివాహం చేసుకుంది. కానీ ప్రస్తుతం విడిపోవడంతో తాజాగా హర్షవర్ధన్‌కు కనెక్ట్ అయ్యింది సంజీదా.
హర్షవర్ధన్, సంజీదా 2020లో విడుదలైన ‘తైష్’ చిత్రంలో కలిసి పనిచేశారు. ఇక రీసెంట్ ఇంటర్వ్యూలో సంజీదా షేక్‌తో తన రిలేషన్షిప్ గురించి అడిగినపుడు అసంతృప్తి వ్యక్తం చేశాడు. జర్నలిస్టులు సెన్సేషన్ కోసం ఇలాంటి కథనాలు రాయడాన్ని అర్థం చేసుకుంటానని పేర్కొంటూనే వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించడంపై తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.