తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హృతిక్ రోషన్.. ‘కహోనా ప్యార్ హై’ సృష్టించిన సంచలం అంతా ఇంతా కాదు. ఓవర్ నైట్ స్టార్ డమ్ తో బాలీవుడ్ ను ఊపేశాడు. అయితే హృతిక్ రోషన్ 2000 సంవత్సరంలో ఈ మూవీతో తెరంగేట్రం చేసినా ఆయనకు చిన్న వయసు నుంచే నటన అంటే ఇష్టమట. పెద్ద యాక్టర్ ను కావాలని ఆలోచించేవాడట. కానీ తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయినా, తన కలల సౌధం సినిమానే అని భావించినా హృతిక్ మాత్రం ‘కహోనా ప్యార్ హై’తోనే కెరీర్ జర్నీకి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాడట. ఈ విషయాన్ని హృతిక్ స్వయంగా బయటపెట్టాడు.
2001లో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ సందర్భంగా హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్ పై ఇద్దరు దుండగులు దాడి చేశారు. తన తండ్రి పరిస్థితి చూసి మనోవేదనకు గురైన హృతిక్.. అన్నింటినీ విడిచిపెట్టి నటనకు గుడ్ బై చెప్పాలనుకున్నాడట. ‘ఆ రోజుల్లో నేను అసహాయుడిగా మిగిలిపోయాను.. కష్టపడి పనిచేయడం, మంచితనంపై విశ్వాసం కోల్పోయినట్లుగా అనిపించింది’.. నా కోసం నేను ఆలోచించకుండానే నిష్క్రమించాలనుకున్నాను’ అని ఈ బాలీవుడ్ నటుడు వివరించాడు. అయితే ఫ్యాన్స్ తోపాటు ఇండస్ట్రీలోని క్లోజ్ ఫ్రెండ్స్ సపోర్టే నన్ను నిలబెట్టి నా ఆలోచనను మార్చిందన్నాడు. ‘నాకు నేనుగా.. ఒంటరిగా ఉండలేనని.. నేను ఎప్పటికీ ప్రత్యేక మార్గంలో వెళ్లలేనని అనిపించేలా నా సన్నిహితుల సపోర్ట్ చూస్తే అర్థమైంది.. నా థింకింగ్ ను మార్చిన అందరికీ థాంక్స్’ అని చెప్పుకొచ్చాడు.
జోధా అక్బర్, జిందగీ న మిలేగీ దుబారా, అగ్నిపథ్, క్రిష్-3 మూవీలతో హృతిక్ బాలీవుడ్ ను ఊపేశాడు. ఈ నటుడు ప్రస్తుతం ‘ఫైటర్’ మూవీలో నటిస్తున్నాడు. దీపికా పదుకొణె ఇందులో లీడ్ రోల్ పోషిస్తోంది.