ప్రభాస్ కథానాయకుడిగా సైన్స్ ఫిక్షన్, మైథాలాజికల్ ఫిల్మ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘కల్కి 2898 AD’ మూవీ.. విడుదలకు ముందే భారీగా కలెక్షన్లు రాబడుతున్నది. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రూపుదిద్దుకున్న ఈ సినిమా అమెరికాలో విపరీతమైన కలెక్షన్లు దక్కించుకుంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మెయిన్ రోల్స్ లో.. బాలీవుడ్ భామలు దీపికా పదుకొణె, దిశా పటాని హీరోయిన్లుగా నటించిన ‘కల్కి’.. రేపు(జూన్ 27న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
హ్యూజ్ కలెక్షన్స్…
భారతీయ సినిమాలకు బిగ్గెస్ట్(Biggest) మార్కెట్ గా ఉంటున్న నార్త్ అమెరికాలో ‘కల్కి’ సినిమా పండుగ చేసుకుంటున్నది. రిలీజ్ కు 24 గంటల ముందే ప్రీమియర్ షో(Premier Shows)ల ద్వారా బాక్సాఫీస్ బద్ధలు కొడుతున్నది. అమెరికా, కెనడాల్లో ప్రీమియర్ షోల రూపేణా లక్ష టికెట్ల దాకా అమ్ముడవగా 3.05 మిలియన్ డాలర్లు(రూ.25 కోట్లు) వసూలు చేసింది. కేవలం USAలోనే 92,000 టికెట్ల ద్వారా 2.77 మిలియన్ డాలర్లు వచ్చాయి.
నయా రికార్డ్…
అమెరికాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా ‘RRR’. రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ 3 మిలియన్ డాలర్లు వసూలు చేస్తే ఇప్పుడా రికార్డును ‘కల్కి 2898 AD’ అధిగమించింది. దుల్ఖర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, మాళవిక మోహనన్, రాంగోపాల్ వర్మ అతిథి పాత్రల్లో మెరవబోతున్నారు. ప్రభాస్ సాహసాలతో కూడిన ఈ సినిమాను అశ్వినీదత్ నిర్మించారు.