టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ రూపొందించిన‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం రీరిలీజ్‌లో దుమ్ములేపుతోంది. ఐదేళ్ల కిందట మొదటిసారి విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించినప్పటికీ.. బాక్సాఫీస్ కలెక్షన్లు మాత్రం నిరాశపరిచాయి. అయితే ఇప్పుడు టాలీవుడ్ సినిమాల రీరిలీజ్ ట్రెండ్‌లో భాగంగా జూన్ 29న మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ముందుగా హైదరాబాద్ సిటీలో 38 షోస్ ప్లాన్ చేసిన మేకర్స్.. టికెట్లన్నీ అడ్వాన్స్ బుకింగ్‌లో సేల్ అయిపోవడంతో షోస్‌ను 100 వరకు పెంచారు. ప్రత్యేకించి యూత్ ఈ మూవీపై ఇంట్రెస్ట్ చూపిస్తుండగా హైదరాబాద్ లో రీరిలీజ్ మార్నింగ్ షోస్ నుంచి రూ. 80 లక్షలు కలెక్ట్ చేసి సర్ప్రైజ్ ఇచ్చింది. అయితే, ఫస్ట్ టైమ్ రిలీజ్లో మార్నింగ్ షోస్‌కు వచ్చిన కలెక్షన్లు రూ.20 లక్షలు మాత్రమే.
విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, సాయి సుశాంత్ లీడ్ రోల్స్ పోషించిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం యూత్ ఆడియన్స్‌లో కల్ట్ ఫిల్మ్‌గా గుర్తింపు పొందింది. ఇక మొదటి రోజున యూత్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ చూసిన మేకర్స్.. జులై 2 వరకు షోస్ కంటిన్యూ చేసేందుకు డిసైడ్ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 200 స్క్రీన్లలో రీ-రిలీజ్ అయిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ మ్యూజిక్ ప్లస్ పాయింట్.