
2023 సినిమాటోగ్రాఫ్ సవరణ చట్టానికి రాజ్యసభ(Rajyasabha) ఆమోదం తెలిపింది. 1952 సినిమాటోగ్రాఫ్ చట్టానికి సవరణగా ఈ బిల్లు తీసుకొచ్చారు. మూవీలను పైరసీ చేసే వారికి ఇకనుంచి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. అంతేకాకుండా సినిమా బడ్జెట్ లో 5 శాతాన్ని నిందితులకు ఫైన్ వేస్తారు. సినిమాలను పైరసీ చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ సవరణ బిల్లు తయారు చేశారు. ఏజ్ ను బట్టి ఇచ్చే సెన్సార్ సర్టిఫికేషన్ లో కేటగిరీలు తీసుకురావాలని ప్రతిపాదించారు. ‘UA 7 ప్లస్’, ‘UA 13 ప్లస్’ ‘UA 16 ప్లస్’ కేటగిరీలను తీసుకురావాలని ప్రపోజ్(Propose) చేశారు.
TVలు, ఇతర మాధ్యమాలకు స్పెషల్ సర్టిఫికేషన్ ఇష్యూ చేసే అధికారాన్ని CBFCకి కట్టబెడుతూ చట్టంలో సవరణ చేశారు. అన్ అఫీషియల్ గా సినిమాను రికార్డు చేయడం, వాటిని షో చేయడం వంటి వాటిపై నిషేధం విధించారు. పైరసీ వల్ల సినీ ఇండస్ట్రీకి ఏటా రూ.20,000 కోట్ల నష్టం జరుగుతున్నదని, దాన్ని అరికట్టేందుకే ఈ బిల్లు తీసుకువస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.