
మావెరిక్ డైరెక్టర్ శంకర్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మెజారిటీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ ప్రాజెక్ట్ ఔట్పుట్ వల్ల కమల్ హాసన్ చాలా హ్యాపీగా ఉన్నారు. రీసెంట్గా రషెస్ చూసిన ఆయన.. ఆనందంతో శంకర్‌కు కాస్ట్లీ వాచ్ గిఫ్ట్‌గా ఇచ్చారు. అయితే తాజా ఇంటర్వ్యూలో ‘ఇండియన్2’ ప్రొడ్యూసర్స్‌లో ఒకరైన ఉదయనిధి స్టాలిన్.. ‘ఇండియన్ 3’ గురించి హింట్ ఇచ్చారు. శంకర్ ఈ ప్రాజెక్ట్ కోసం ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారని వెల్లడించారు. అయితే ‘ఇండియన్ 2’ ఫలితాల ఆధారంగా ఉంటుందని తెలిపారు.

ఇక ‘ఇండియన్ 2’ మూవీకి సంబంధించి 20 రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్‌లో ఉంది. అది పూర్తయిన తర్వాత సీజీ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు ఉదయనిధి స్టాలిన్. ఈ మేరకు 2024 ఏప్రిల్‌లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ఆయన తెలిపారు. రెడ్ జెయింట్ మూవీస్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సిద్ధార్థ్, సముద్రఖని, బాబీ సింహా తదితరులు కూడా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.