
‘సూపర్ స్టార్’ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ మూవీ ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ ను క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్ గా 4,000 థియేటర్లలో ఆడుతూ ఇప్పటిదాకా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో రిటైర్డ్ జైలర్ పాత్రలో నటించిన ‘జైలర్’ మూవీ.. ఇవాళ్టి నుంచి OTTలో అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో ఈరోజు(సెప్టెంబరు 7) నుంచి స్ట్రీమింగ్ అవుతున్నది. తమిళ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు నమోదు చేసినందుకు ఫుల్ హ్యాపీగా ఉన్న నిర్మాత కళానిధి మారన్.. ఇప్పటికే భారీ అమౌంట్(Amount) తో కూడిన చెక్కులను డైరెక్టర్ దిలీప్ కుమార్ తోపాటు రజనీకి అందించారు. కలెక్షన్లలో రికార్డులు బ్రేక్ చేస్తున్నందుకు గాను ఈ చెక్కులతోపాటు లగ్జరీ కార్లను ఆ ఇద్దరికీ ముట్టజెప్పారు.
సన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ మూవీ కేవలం వారం రోజుల్లోనే రూ.300 కోట్ల కలెక్షన్లు సాధించిందని మూవీ ప్రొడక్షన్ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది తమిళనాడు ఇండస్ట్రీ అయిన కోలీవుడ్ లోనూ రికార్డు దిశగా దూసుకెళ్తున్నది. ఒక్క కోలీవుడ్ లోనే అన్ని రైట్స్ కు కలిపి రూ.500 కోట్లు వసూలు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ‘జైలర్’ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ రూ.100 కోట్లు వెచ్చించిందట. దీన్ని బట్టే అర్థమవుతుంది రజనీ సినిమాకు డిమాండ్ ఏ రీతిలో ఉందో. రమ్యకృష్ణ, వసంత్ రవి, వినాయకన్, సునీల్, మిర్నా మీనన్ మెయిన్ రోల్స్ లో నటించారు.