
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్, అజయ్ దేవ్గన్ వైఫ్ కాజోల్.. సెలబ్రిటీల ప్రైవసీ గురించి ఆందోళన వ్యక్తం చేసింది. ఇండస్ట్రీలో సెలబ్రిటీల ఫొటోల కోసం ఫొటోగ్రాఫర్స్ వ్యవహరిస్తున్న తీరును తప్పబట్టింది. ఫొటోలకు పోజులు ఇవ్వడం సెలబ్రిటీ లైఫ్‌లో ఒక భాగం అయినప్పటికీ ప్రతిచోటుకు వారిని ఫాలో కావడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడింది కాజోల్. ఓసారి తాను పనిమీద బయటికి వెళ్లినపుడు ఫొటోగ్రాఫర్స్ తన కారును వెంబడించిన సంఘటనను తాజా ఇంటర్వ్యూలో ఆమె వివరించింది.
సెలబ్రిటీల విషయంలో ఫొటోగ్రాఫర్స్ కల్చర్ గురించి లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన కాజోల్.. ప్రస్తుతం ఈ కల్చర్ పరిమితి దాటిపోయిందని చెప్పారు. స్లోగా ప్రారంభమై, ఇప్పుడు పీక్ స్టేజ్‌లో ఉంది. ఇది తగ్గకపోతే నటులుగా ఉన్నవారి మనుగడకు ప్రమాదం వాటిల్లుతుంది. కాబట్టి ఇది తగ్గాలన్నారు. ఈ విషయంలో తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ.. ‘ఒక రోజు నేను బాంద్రా నుంచి వెళ్తుండగా.. ఫొటోగ్రాఫర్స్ నా కారును చూసి ఫాలో అవడం మొదలుపెట్టారు. అప్పుడు నేను షూటింగ్, పబ్లిక్ ప్లేస్, హోటల్, రెస్టారెంట్.. ఎక్కడికీ వెళ్లలేదు. నేను స్టార్‌ని కాబట్టి నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారు? అని అడగలేను. నేను ఏం ధరించానో పట్టించుకోకుండా 7-8 మంది కెమెరాలతో నిలబడి ఉన్నారు. సో.. ఎంతో జాగ్రత్త వహించాలి’ అని చెప్పుకొచ్చారు.