వరల్డ్ వైడ్ గా దుమ్మురేపుతున్న ‘కల్కి 2898 AD’ సినిమా… వందల కోట్ల కలెక్షన్లతో సరికొత్త రికార్డుల దిశగా సాగుతున్నది. సైన్స్ ఫిక్షన్, మైథాలాజికల్ కాన్సెప్ట్(Concept)తో వచ్చిన ఈ మూవీ… 3 వారాలుగా ఉర్రూతలుగిస్తున్నది. అయితే ఇది ఎప్పుడు OTT ప్లాట్ ఫామ్ లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న వారికి హింట్ ఇచ్చారు మేకర్స్.
10 వారాల తర్వాత…
జూన్ 27న ‘కల్కి 2898 AD’ రిలీజ్ కాగా.. 16 రోజుల్లోనే రూ.1,000 కోట్లు రాబట్టింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మెయిన్ రోల్స్ లో.. బాలీవుడ్ భామలు దీపికా పదుకొణె, దిశా పటాని హీరోయిన్లుగా నటించారు.
విడుదలైన 10 వారాల తర్వాత అంటే సెప్టెంబరులో OTT ద్వారా ఈ సినిమాను చూడొచ్చన్నమాట. దుల్ఖర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, మాళవిక మోహనన్, రాంగోపాల్ వర్మ అతిథి పాత్రల్లో మెరిసిన ఈ సినిమాను అశ్వినీదత్ నిర్మించారు.