వివాదాల క్వీన్ గా మారిపోయిన బాలీవుడ్ నటి, MP కంగనా రనౌత్ తాజా సినిమాకు లైన్ క్లియర్ అయింది. ఆమె స్వీయ(Self) దర్శకత్వంలో తయారైన ‘ఎమర్జెన్సీ’ మూవీకి CBFC(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) U/A సర్టిఫికెట్ లభించింది. మూడు సీన్లలో మార్పులు చేస్తామని హామీ ఇవ్వడంతో ఇక సినిమా విడుదలకు మార్గం సుగమమైంది.
తరచూ వాయిదా పడటం ఒకెత్తయితే ‘ఎమర్జెన్సీ’ని పంజాబ్ లో రిలీజ్ చేయొద్దంటూ కంగనకు బెదిరింపులు(Threats) వచ్చాయి. ఇందిరాగాంధీ బయోపిక్ తో తయారైన ఈ మూవీ.. తమకు వ్యతిరేకంగా ఉందంటూ శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ(SGPC) లీగల్ నోటీసులు పంపింది. బంగ్లాదేశ్ శరణార్థులపై పాకిస్థాన్ సైన్యం విరుచుకుపడి పసిపాపతోపాటు ముగ్గురు మహిళల తలలు నరికిన సన్నివేశాలపైనా CBFC మార్పులు కోరింది.