దేశంలో ఇప్పుడు ‘కల్కి 2898 AD’ మేనియా నడుస్తున్నది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తం(Worldwide)గా ఫస్ట్ డే కలెక్షన్లు రూ.200 కోట్లు అన్న చర్చ జరిగింది. రిలీజైన ప్రతి చోటా పాజిటివ్ టాక్ రావడంతో భారీ ఓపెనింగ్స్ ఉంటున్నాయి. ఇందులో ‘బుజ్జి’ అనే కారు కీలక రోల్ ప్లే చేయగా ఇప్పుడు దాన్ని చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. భైరవ పాత్రలో ప్రభాస్.. ‘కల్కి బుజ్జి’తో చేసిన విన్యాసాలు హైలెట్ గా నిలిచాయి.
ప్రత్యేకంగా…
నాగ్ అశ్విన్ ప్రత్యేకంగా మహీంద్రా కంపెనీతో ఈ 6 టన్నుల కారును రూ.7 కోట్లతో తయారు చేయించారు. ప్రమోషన్లో భాగంగా ఈ ‘బుజ్జి’ కారు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నది. రేస్ కారు మోడల్లో ఉన్న ఈ వెహికిల్ అందర్నీ ఆకర్షించేలా ఉంది. హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ వద్ద ప్రదర్శనకు ఉంచారు.
కాంతారా ఫేమ్…
‘కాంతారా’ హీరో, దర్శకుడు రిషభ్ షెట్టి సైతం ఈ ‘కల్కి బుజ్జి’పై మనసు పారేసుకున్నారు. ‘బుజ్జి గ్యాంగ్’కు విషెస్ చెప్పిన రిషభ్.. సతీమణి ప్రగతి, కుమారుడు రణ్వీత్ తో కలిసి ఫొటోలు దిగి ‘ఇన్ స్టాగ్రామ్’లో పోస్ట్ చేశారు.