మైసూర్ శాండల్(Mysore Sandal) సబ్బులకు ప్రచారకర్తగా తమన్నాతో ఒప్పందం.. కర్ణాటకలో ఆందోళనలకు కారణమైంది. స్థానిక నటుల్ని కాదని బాలీవుడ్ హీరోయిన్ తో ఒప్పందం చేసుకోవడం మీద వస్తున్న విమర్శలపై సర్కారు వివరణ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కర్ణాటక సోప్స్ డిటర్జంట్ లిమిటెడ్(KSDL)ను ప్రమోట్ చేసేందుకే తమన్నాను తీసుకున్నట్లు తెలిపింది. రష్మిక, పూజా హెగ్డే, కియారా అద్వానిని పరిగణలోకి తీసుకున్నా.. తమ పోటీ బ్రాండ్లకు అంబాసిడర్లుగా ఉండటంతో ఆ ఛాన్స్ తమన్నాకు ఇచ్చామని చెప్పింది. పాశ్చాత్య(Western) దేశాలతోపాటు గల్ఫ్ లోనూ మార్కెటింగ్ ద్వారా రూ.5,000 కోట్లు ఆర్జించాలనేది సిద్ధరామయ్య సర్కారు లక్ష్యం.