750కి పైగా చిత్రాలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పెట్టని ‘కోట’గా నిలిచారు నవరస నటనా చాతుర్యుడు శ్రీనివాసరావు. 1942 జులై 10న జన్మించిన ఆయన… పుట్టినరోజు తర్వాత మూడు రోజులకే 83 ఏళ్లకు కన్నుమూశారు. 9 నంది పురస్కారాలు అందుకున్న ఆయన.. అహ నా పెళ్లంట, ప్రతిఘటన, గాయం వంటి సినిమాలతో తెలుగు సినిమాలో తన స్థానమేంటే తెలియజెప్పారు. 2012లో కృష్ణం వందే జగద్గురుమ్ మూవీకి సైమా(SIIMA) అవార్డు గెలుచుకున్నారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో రంగప్రవేశం చేసిన ఈ విలక్షణ నటుడు.. గత కొద్దిరోజులుగా అస్వస్థతతో ఉన్నారు. 1999-2004 వరకు విజయవాడ(తూర్పు) MLAగా సేవలందించారు. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com