శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. రూ.60 కోట్లు ఎగవేశారంటూ ముంబయి జుహూ(Juhu) పోలీస్టేషన్లో కేసు ఫైల్ అయింది. బెస్ట్ డీల్ టీవీ ప్రై.లిమిటెడ్ డైరెక్టర్ల పేరిట వ్యాపారవేత్త దీపక్ కొఠారి నుంచి 2015-2023 కాలంలో డబ్బు తీసుకున్నారు. ఏటా 12% వడ్డీతో చెల్లిస్తామని 2016లో గ్యారంటీ ఇచ్చారు. కానీ వ్యాపారానికి కాకుండా సొంత ఖర్చులకు వాడుకున్నారు. ఆ ఫర్మ్ నుంచి శిల్ప తప్పుకోవడంతో ఆగస్టు 14న కేసు పెట్టారు. ఎవరైనా దేశం విడిచి వెళ్లారని భావిస్తే ఆయా దేశాల్లో వారి కదలికల్ని గుర్తించేందుకు లుకౌట్ నోటీసులిస్తారు.