
మెగా డాటర్ నిహారిక కొణిదెల తన భర్త చైతన్యతో విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్త వెలువడినప్పటి నుంచి నిహారిక, చైతన్యలో ముందుగా ఎవరు అధికారికంగా డివోర్స్‌కు అప్లయ్ చేశారు? అసలు ఏమై ఉంటుందనే విషయాలపై నెటిజన్లు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ముందుగా నిహారికనే విడాకులకు దరఖాస్తు చేసి ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అసలు కథ వేరేలా ఉంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్న ఈ-కోర్టు డాక్యుమెంట్ ప్రకారం.. విడాకుల కోసం మొదట దాఖలు చేసింది జేవీ చైతన్యనే. ఆ తర్వాతే నిహారిక దానిపై స్పందించింది. ఇదిలా ఉంటే.. ఈ కేసులో నిహారిక తరపు న్యాయవాది దిలీప్ సుంకర పేరు ఎక్కువగా వినిపిస్తోంది. జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా సేవలందిస్తున్న ఆయనే ఈ విడాకులు పరస్పర అంగీకారంతో మంజూరు చేయించారట. ఈ ప్రాసెస్ మొత్తం సజావుగా జరగడంలో అతనే కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది.
ఇక మెగా బ్రదర్ నాగబాబు సైతం ఇటీవలే దిలీప్ బర్త్ డే సందర్భంగా ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. కాగా జనసేన స్థాపించి 10 ఏళ్లు అవుతుండగా.. మొదటి నుంచి దిలీప్ సుంకర. పార్టీకి మద్దతుదారుగా నిలబడ్డాడు. ఇప్పుడు పార్టీ అవుట్స్పోకెన్ పర్సన్స్‌లో ఒకరిగా ఎదిగారు.