మంచు కుటుంబంలో జరుగుతున్న విషయాల(Issues)న్నీ ఈ రోజు సాయంత్రం బయటపెడతానని మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్(Manoj) అన్నారు. ఇంట్లో ఎవరూ కష్టపడనంతగా గొడ్డులాగా పనిచేసినా, తన కుటుంబాన్ని చిన్నచూపు చూస్తున్నారని కుటుంబ సభ్యుల తీరుపై ఆవేదన చెందారు. మీడియా అండగా ఉండటం తన అదృష్టమన్న మనోజ్.. మోహన్ బాబు దాడిలో గాయపడ్డ బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. మీడియా ప్రతినిధులపై దాడి జరగడం పట్ల బాధను వ్యక్తం చేసిన మనోజ్.. మోహన్ బాబు, విష్ణు ప్రవర్తించిన తీరుపై క్షమాపణలు చెప్పారు.
గాయపడ్డ మీడియా సిబ్బంది పేర్లను ప్రస్తావించిన ఆయన.. బాధితులకు, తనకు ఒక్క ఫోన్ కాలే దూరమంటూ మాట్లాడారు. ఇవాళ సాయంత్రం మళ్లీ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానంటూ అది ఎక్కడ అనేది కొద్దిసేపట్లో ప్రకటిస్తానన్నారు. తనకు అయిన గాయాల్ని తెలియజేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తండ్రి అంటే తనకు ఎంతో ఇష్టమని, ఈ మోహన్ బాబు అసలు మోహన్ బాబు కాదంటూనే మా నాన్నను విష్ణు ట్రాప్ చేశారని ఆరోపించారు.