మైథలాజికల్ మూవీగా రూపుదిద్దుకున్న ‘కల్కి 2898 AD’ కలెక్షన్లలో దుమ్మురేపుతుండగా.. అలాంటి కాన్సెప్ట్ తోనే వస్తున్న మరో సినిమా ‘కన్నప్ప’. మంచు విష్ణు కథానాయకుడి(Hero)గా భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ మూవీ రిలీజ్ గురించి ‘X’లో పంచుకున్నారు విష్ణు. ఈ డిసెంబరులో థియేటర్లలోకి వస్తుందని ప్రకటించారు.
ముకేశ్ కుమార్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ టీజర్ జూన్ 14న విడుదలైంది. అంతకుముందే మేలోనే టీజర్‌ను కేన్స్(Cannes) ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించారు. శివభక్తుడిగా ‘కన్నప్ప’ పాత్రలో విష్ణు కనిపిస్తుండగా.. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, మలయాళీ స్టార్ మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
మంచు విష్ణు స్క్రీన్ ప్లేలో వస్తున్న ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, ఈశ్వర్ రెడ్డి, జి.నాగేశ్వర్ రెడ్డి, తోట ప్రసాద్ సంయుక్తంగా కథ రాశారు. మోహన్ బాబు, శరత్ కుమార్, ముకేశ్ రుషి, బ్రహ్మానందం మిగతా నటులు. మణిశర్మ, స్టీఫెన్ దెవాసి సంగీతం అందిస్తున్నారు.