మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘భోలా శంకర్’ చిత్రంలో నటిస్తున్నారు. తమిళ్లో విజయం సాధించిన ‘వేదాళం’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకుడు. ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే.. చిరు మరో మూవీని లైన్లో పెట్టేశారు. ‘బంగార్రాజు’ మూవీ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతో నెక్ట్స్ మూవీకి సిద్ధమవుతున్నారు. ‘ధమాకా’ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ అందిస్తుండగా.. మెగాస్టార్ పెద్ద కూతురు సుష్మిత నిర్మాతగా వ్యవహరించనున్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సుష్మితతో పాటు ఆమె భర్త విష్ణు ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ విషయానికొస్తే.. గతంలో ‘సోగ్గాడే చిన్ని నాయన, రారండోయ్ వేడుక చూద్దాం, బంగార్రాజు’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తెరకెక్కించడంలో తనకు మంచి పేరుంది. ఈ నేపథ్యంలో చిరంజీవిని కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథతోనే ఒప్పించారా? తెలియాల్సి ఉంది. ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.
ఇదిలా ఉంటే.. బింబిసార డైరెక్టర్ వశిష్టతో మెగాస్టార్ సినిమా చేయబోతున్నారని కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు కళ్యాణ్ కృష్ణతో కమిట్ అయ్యారు చిరు. అయితే, వశిష్టతో ప్రాజెక్ట్ కోసం ప్రీప్రొడక్షన్ వర్క్ సహా కథపై మరింత లోతుగా పనిచేయాల్సి ఉందట. అందుకే ఆ మూవీని హోల్డ్‌లో పెట్టారు చిరంజీవి. ఆ కథ పూర్తిస్థాయిలో సిద్ధమయ్యేలోపు కళ్యాణ్‌తో సినిమా ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘భోలా శంకర్’ ఆగస్టు 11న విడుదల కానుంది.