మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడి పార్టీకి విరాళం(Donation) అందజేశారు. తెలుగుదేశం(TDP), BJPతో అలయెన్స్ లో భాగంగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న పవన్ కల్యాణ్ కు మద్దతుగా ఈ విరాళం అందజేశారు. హైదరాబాద్ ముచ్చింతల్లో జరుగుతున్న ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ లో ఉన్న చిరంజీవిని ఆయన తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్ కలిశారు. అదే సమయంలో రూ.5 కోట్ల చెక్కును సోదరుడు పవన్ కు చిరు అందజేశారు. అన్నయ్య కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు జనసేన అధినేత పవన్.
వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో వస్తున్న ‘విశ్వంభర’.. చిరంజీవికి 156వ సినిమా. ఈ సోషియో ఫాంటసీ మూవీలో త్రిష ఫిమేల్ లీడ్(Female Lead) పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముచ్చింతల్ లో నడుస్తుండగా.. అటు పవన్ సైతం ఎలక్షన్ల బిజీలో ఉన్నారు. తెలుగుదేశం పొత్తులో భాగంగా 24 సీట్లు దక్కించుకున్న జనసేనాని.. జగన్ ఓడించడమే లక్ష్యమంటూ ముందుకు సాగుతున్నారు. పవన్ కు పాటిలిక్స్ పరంగా నాగబాబు సపోర్ట్ గా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు చిరంజీవి కూడా చిన్న తమ్ముడికి తన సపోర్ట్ నిస్తూ విరాళం అందించారు.