మెగాస్టార్ చిరంజీవి మరోసారి చెల్లెలి సెంటిమెంట్ తో సినిమా చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉండగా.. ‘విశ్వంభర’కు సంబంధించిన కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ‘విశ్వంభర’కు సంబంధించి అనేక విశేషాలు బయటకు వస్తున్నాయి. ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’, ‘అంజి తర్వాత’ చిరు చేస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ఇది. చాలాకాలం తర్వాత మెగాస్టార్ మరోసారి సిస్టర్ సెంట్ మెంట్ తో సినిమా చేస్తున్నారు. వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి ఈ సినిమాకు నిర్మాతలు.
అదే సెంటిమెంట్ మళ్లీ…
‘అల్లుడా మజాకా’, ‘హిట్లర్’ సినిమాలతో అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని బాగా పండించారు ఆ చిత్రాల దర్శకులు. ఇప్పుడు ‘విశ్వంభర’లోనూ అదే తీరుగా సిస్టర్ సెంటిమెంట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో మెగాస్టార్ కు సోదరీమణులు(Sisters) ఐదుగురు నటిస్తారని టాక్. ప్రధాన హీరోయిన్ గా త్రిష పేరు ఫైనల్ కాగా.. ఇషా, ఆషికా రంగనాథ్ వంటి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. 70 శాతం విజువల్ ఎఫెక్ట్స్ తోనే ‘విశ్వంభర’ పట్టాలకెక్కుతున్నది.
బర్త్ డే నాడు అనౌన్స్…
UV క్రియేషన్స్ పై మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’. 2023 ఆగస్టులో ఈ సినిమా ప్రకటన చేస్తే 2025 జనవరి 10న విడుదల చేస్తామని ముందుగానే నిర్మాణ సంస్థ తెలిపింది. చిరు బర్త్ డే అయిన ఆగస్టు 22 నాడు ఈ సినిమా ప్రకటన రాగా.. మెగాస్టార్ కు ఇది 156వ సినిమా. ఇప్పటికే ఓవర్సీస్ హక్కుల(Rights) కోసం సారెగామ సంస్థ రూ.18 కోట్లు చెల్లించింది. తెలుగులో ‘నాయకి’ సినిమా తర్వాత ఎనిమిదేళ్లకు త్రిష.. ‘విశ్వంభర’ ప్రాజెక్టులో భాగమయ్యారు.