మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన(Rarest) ఘనతను సొంతం చేసుకున్నారు. గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించి ఏ నటుడికీ అందని గౌరవాన్ని అందుకున్నారు. విభిన్న ఆహార్యం, నటనకు గాను ‘మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ ఇండస్ట్రీ’ పేరిట ఈ రికార్డు దక్కింది. అత్యధిక నృత్యరీతులు(Dance Movements) చేసినందుకు గాను ఆయన్ను గిన్నీస్ బుక్ కు ఎంపిక చేసింది.
537 పాటలు, 24 వేల డ్యాన్స్ మూమెంట్లకు గాను గౌరవం దక్కగా, గిన్నిస్ ప్రతినిధితోపాటు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్… చిరంజీవికి సర్టిఫికెట్ అందజేశారు. ఇది తనకు ఊహించని గౌరవమని మెగాస్టార్ ఆశ్చర్యం చెందుతూ.. యాక్టింగ్ కంటే ముందే డ్యాన్స్ ను మొదలుపెట్టాను అని సంతోషం పంచుకున్నారు. నిన్ననే ఆయనకు అక్కినేని జాతీయ పురస్కారం ప్రకటించారు.