చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్లపై శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి నిర్మించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘మేమ్ ఫేమస్’. సుమంత్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన చిత్రానికి తనే దర్శకత్వం వహించడం విశేషం. మే 26న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లు రాబట్టింది.
ఇక థియేటర్స్‌లో ఈ మూవీ విడుదలై నెల రోజులు కంప్లీట్ కావడంతో ఓటీటీ ప్లాట్ఫామ్లోకి అందుబాటులోకి వచ్చేసింది. ఈ రోజు (జూన్ 30) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలంగాణ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయినవారు ఇప్పుడు ప్రైమ్ వీడియోలో చూసేయొచ్చు.
ఇక ‘మేమ్ ఫేమస్’ చిత్రంలో మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాశి, కిరణ్ మచ్చ, అంజి మామ, నరేంద్ర రవి, మురళీధర్ గౌడ్, శివ నందన్ ముఖ్య పాత్రలు పోషించారు. కళ్యాణ్ నాయక్ మ్యూజిక్ అందించారు. కథ విషయానికొస్తే.. ఊరిలో అల్లరి చిల్లరగా తిరిగే యువకులు నిత్యం తల్లిదండ్రులతో చివాట్లు తింటుంటారు. అలాంటివాళ్లు యూట్యూబ్ వీడియోల ద్వారా ఎలా ఫేమస్ అయ్యారనే పాయింట్ చుట్టూ కథ నడుస్తుంది. ఈ క్రమంలో ఫ్రెండ్స్ మధ్య జరిగే కామెడీ సీన్లు, విలేజ్ బ్యాక్‌డ్రాప్ లవ్ స్టోరీ చుట్టూ ఫుల్ ఫన్ జనరేట్ చేశారు దర్శకుడు సుమంత్.