ఒక వర్గాన్ని కించపరిచారంటూ రచ్చగా మారిన ‘ఎల్ 2 ఎంపురాన్(L2 Empuraan)’ మూవీ సీన్లు భారీగా కట్ కాబోతున్నాయి. ఈ మోహన్ లాల్ సినిమాను.. 2002 గుజరాత్ అల్లర్ల ఆధారంగా తీశారు. ఓ కుటుంబాన్ని ఇంకో వర్గం నేత చంపడం, ఆ తర్వాత అతడే రాజకీయాల్లో అడుగుపెట్టిన తీరుపై మూవీ తయారైంది. దీనిపై దేశవ్యాప్తంగా రచ్చ రేగడంతో మోహన్ లాల్ క్షమాపణలు చెప్పారు. ఇలా తీవ్ర వివాదంగా మారిన ‘ఎల్ 2 ఎంపురాన్’లో మొత్తం 17 సీన్లు తొలగించబోతున్నారట.