డార్లింగ్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆదిపురుష్’ గతవారం విడుదలై నాలుగైదు రోజుల్లో 400 కోట్ల క్లబ్లో చేరింది. కానీ ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. దీంతో ఈవారం ఓటీటీ, థియేటర్లలో విడుదలయ్యే సినిమాలపై ప్రేక్షకులు ఫోకస్ చేస్తున్నారు. నిజానికి కూడా ఈసారి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఇంట్రెస్టింగ్ సినిమాలు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
ధూమమ్: మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్, కన్నడ దర్శకుడు పవన్ కుమార్ కాంబినేషన్లో రూపొందిన థ్రిల్లర్ మూవీ ధూమమ్ జూన్ 23న నాలుగు సౌత్ లాంగ్వేజెస్‌లో విడుదలవుతోంది. ఈ చిత్రంలో అపర్ణా బాలమురళి కథానాయికగా నటిస్తోంది.
1920: హార్రర్స్ ఆఫ్ హార్ట్: 1920 సిరీస్ నుంచి వస్తున్న ఐదో భాగమే ‘1920 : హార్రర్స్ ఆఫ్ హార్ట్’. శుక్రవారం విడుదల కానున్న ఈ మూవీకి కృష్ణ భట్ దర్శకత్వం వహించగా.. అవికా గోర్, రాహుల్ దేవ్ ప్రధాన పాత్రలు పోషించారు.
మను చరిత్ర: భరత్ పెదగాని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివ కందుకూరి, మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రలు పోషించారు.