అక్కినేని కుటుంబంలో మరోసారి పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. నాగచైతన్య ఇంకోసారి వివాహం చేసుకోబోతున్నట్లు ఆయన తండ్రి నాగార్జున ప్రకటించారు. ఈ మేరకు శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం(Engagement) పూర్తయిందని తెలిపారు. గత కొన్ని నెలలుగా చైతూ ప్రముఖ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. వీటిని అతడు కొట్టిపడేయగా… చివరకు ఆ వార్తలే నిజమయ్యాయి.
2021 అక్టోబరులో సమంతకు విడాకులిచ్చారు నాగచైతన్య. కొద్దినెలల కిందట చైతూ-శోభిత జోడీ ఫారిన్ వెకేషన్లో మీడియా కంట పడింది. మూడేళ్లకు మరో వివాహం చేసుకోబోతున్న అతడి ఎంగేజ్మెంట్ కు అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు మాత్రమే హాజరయ్యాయి. త్వరలోనే పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేస్తామని నాగార్జున తెలియజేశారు. కాబోయే వధూవరులతో దిగిన ఫొటోల్ని ఆయన షేర్ చేసుకున్నారు.