తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘బిగ్ బాస్ సీజన్ 7’ త్వరలోనే ముందుకు రానుంది. ‘స్టార్ మా’ ఛానల్లో ప్రసారం కానున్న ఈ రియాలిటీ షోకు అంతా సిద్ధమైంది. అయితే కొన్నిరోజులుగా హోస్ట్ విషయమై మీడియాలో అనేక రూమర్స్ వెలువడ్డాయి. నాగార్జునకు బదులు నందమూరి బాలకృష్ణ, రానా పేర్లు వినిపించాయి. కానీ అవన్నీ ఫేక్ వార్తలనీ, నాగార్జున అక్కినేని బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కి హోస్ట్‌గా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. కాగా.. మూడో సీజన్ నుంచి హోస్ట్‌గా కంటిన్యూ అవుతున్న నాగార్జునకు ఇది వరుసగా ఐదో సీజన్ కానుంది.
ఇదిలా ఉంటే.. నాగార్జున ఇప్పటికే ఇప్పటికే బిగ్ బాస్ రియాలిటీ షో కోసం తన డేట్స్ బ్లాక్ చేసినట్లు సమాచారం. ఈ మేకర్స్ బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్స్ లిస్ట్‌పై కసరత్తు చేస్తున్నట్లు టాక్. ఇక ఇటీవలే ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 7- ఫుల్ ప్యాకేజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ క్యాప్షన్‌తో స్టార్ మా సంబంధిత ప్రోమో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ‘ఎమోషన్స్, సర్ప్రైజెస్, థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో మిమ్మల్ని రోలర్‌కోస్టర్ రైడ్‌కు తీసుకెళ్లే ఈ ‘BB7 తెలుగు’ కోసం సిద్ధంగా ఉండండి’ అంటూ సదరు క్యాప్షన్‌లో పేర్కొంది.