
నేచురల్ స్టార్ నాని నటించిన చివరి చిత్రం ‘దసరా’. ఈ మూవీ బాక్సాఫీస్ వంద కోట్లు కలెక్ట్ చేసి, నాని కెరీర్లో ఈ ఫీట్ సాధించిన మొదటి చిత్రంగా నిలిచింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వ ప్రతిభకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ప్రస్తుతానికి నాని NANI30 చిత్రంలో నటిస్తున్నాడు. వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శౌర్యవ్ అనే నూతన దర్శకుడు పరిచయమవుతున్నాడు. ఇక ఈ చిత్రంలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఫిమేల్ లీడ్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా నాని నెక్ట్స్ మూవీపై మరొక అప్డేట్ వచ్చేసింది. తమిళ దర్శకుడు సిబి చక్రవర్తితో సినిమా కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
చక్రవర్తి గతంలో తమిళంలో సూపర్ హిట్ అయిన ‘డాన్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. రీసెంట్గా తను నానికి ఒక స్క్రిప్ట్ వివరించగా.. పాజిటివ్‌గా స్పందించినట్లు తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. అయితే దీని కంటే ముందుగా నాని వివేక్ ఆత్రేయతో ఒక డార్క్ థ్రిల్లర్ మూవీ చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా లాంచ్ కానుండగా.. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభమవుతుంది. కాగా.. వచ్చే ఏడాది సిబి చక్రవర్తి మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు నాని ప్లాన్ చేస్తు్న్నట్లు టాక్.