
బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా ఏ విషయంలో అయినా నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుంది. ఆమె నటించిన ‘లస్ట్ స్టోరీస్2’ ఆంథాలజీ సిరీస్ జూన్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న నీనా.. తాజా ఇంటర్వ్యూలో తన మొదటి ఆన్‌స్క్రీన్ కిస్ సీన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది. ఆ సీన్ షూట్ చేసేముందు టెన్షన్ పడ్డట్లు గుర్తు చేసుకుంది. 1990ల్లో కెరీర్ ప్రారంభంలో ఉన్నపుడు ‘దిల్లాగి’ అనే టీవీ సీరియల్లో ఆమె దిలీప్ ధావన్ సరసన కనిపించింది. ఇందులో దిలీప్‌తో కిస్సింగ్ సీన్స్ చేసిన తర్వాత డెట్టాల్‌తో నోరు కడుక్కున్నట్లు వెల్లడించింది.

ఇదే విషయం గురించి నీనా మాట్లాడుతూ.. ‘నటుడిగా రకరకాల సన్నివేశాలు చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి బురదలో స్టెప్పులేయాల్సి ఉంటుంది లేదా కొన్ని గంటలపాటు ఎండలో నిలబడాల్సి వస్తుంది. చాలా ఏళ్ల క్రితం దిలీప్ ధావన్‌తో ఓ సీరియల్ చేశాను. ఇండియన్ టీవీలో మొట్టమొదటి లిప్-టు-లిప్ కిస్సింగ్ సీన్. నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. అతను నాకు ఫ్రెండ్ కాదు కానీ అందంగా ఉండేవాడు. అయినప్పటికీ నేను శారీరకంగా, మానసికంగా సిద్ధంగా లేను. దీతో చాలా టెన్షన్పడ్దాను. కానీ ఎలాగో ఆ సీన్ చేసేందుకు మేకర్స్ నన్ను ఒప్పించారు’ అని తెలిపింది.
ఇక ఆ సీన్ ముగిసిన వెంటనే డెట్టాల్‌తో నోరు కడుక్కున్నట్లు చెప్పిన నీనా.. తెలియని వారిని ముద్దు పెట్టుకోవడం చాలా కష్టమని చెప్పింది. అయితే ఆ ముద్దు సన్నివేశాన్ని ప్రేక్షకులు సైతం అంగీకరించలేదని, మేకర్స్ ఆ సీరియల్‌ను స్క్రాప్ చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఎందుకంటే ఆ టైమ్‌లో ఇంట్లో అందరూ కలిసి టీవీలో సీరియళ్లు చూసేవారని.. ఈ ముద్దు సన్నివేశం చూడటం ఇబ్బందిగా మారిందని చెప్పుకొచ్చింది.