భారతదేశ(Nation) సెంటిమెంట్ ను గౌరవిస్తామని ఆ మేరకే తమ కంటెంట్ ఉంటుందని OTT దిగ్గజం నెట్ ఫ్లిక్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన సమావేశం తర్వాత ఈ మేరకు ప్రకటన చేసింది. 1999లో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం హైజాక్ అయిన తీరుపై ‘IC 814 కాందహార్ హైజాక్’ పేరిట వెబ్ సిరీస్ రిలీజ్ చేసింది.
ఇందులోని పాత్రల పేర్లు భారతీయ మనోభావాల్ని దెబ్బతీసేలా ఉండటంతో కేంద్రం చర్యలు ప్రారంభించింది. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 29న విడుదలైంది. పాక్ టెర్రరిస్ట్ గ్రూప్ హర్కతుల్-ముజాహిదీన్ హైజాక్ కు పాల్పడింది. హైజాకర్లకు ‘భోళా’, ‘శంకర్’ పేర్లు పెట్టడంతో సోషల్ మీడియాలో యుద్ధం మొదలైంది.
భారత్ ఆరాధించే శివుడి పేరును టెర్రరిస్టులకు పెట్టడం ద్వారా వారి నేరాలను వైట్ వాష్ చేసే ఎజెండాతో భావితరాల్ని తప్పుదోవ పట్టేంచేలా నిర్మాతలు వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై నోటీసులివ్వడంతో నెట్ ఫ్లిక్స్ ఇండియా ప్రతినిధులు(Representatives) కేంద్రంతో భేటీ అయ్యారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.