బాహుబలి, RRRతో తెలుగు చలన చిత్ర ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేసి కలెక్షన్ల రూపురేఖల్ని మార్చిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. తెలుగు ప్రేక్షకులు జక్కన్నగా పిలుచుకునే ఈ స్టార్ డైరెక్టర్.. RRRకు ఆస్కార్ అవార్డ్ తో వరల్డ్ వైడ్ గా పాపులర్ అయ్యారు. రాజమౌళి గురించి తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా సినీ ఫ్యాన్స్ కు ఆసక్తి(Interest) ఎక్కువైంది.
దీంతో ఆయన సినీ ప్రస్థానంపై డాక్యుమెంటరీ తీస్తామంటూ ప్రముఖ OTT సంస్థ నెట్ ఫ్లిక్స్ ముందుకొచ్చింది. మోడ్రన్ మాస్టర్స్ సిరీస్ లో భాగంగా ప్రత్యేక డాక్యుమెంటరీని రూపొందించిన నెట్ ఫ్లిక్స్… స్ట్రీమింగ్ డేట్ ను కూడా ప్రకటించింది. ఆగస్టు 2 నుంచి ‘మోడ్రన్ మాస్టర్స్; ఎస్.ఎస్.రాజమౌళి’ని చూడవచ్చు.
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సహా జో రూసో, కరణ్ జోహార్ వంటి దిగ్గజాల అభిప్రాయాలతో ఈ డాక్యుమెంటరీ తయారైంది. వీరితోపాటు రాజమౌళి సినిమాల హీరోలు ప్రభాస్, జూ.NTR, రాంచరణ్ తదితరులు తమ ఒపీనియన్స్ ను తెలియజేస్తారు.